నెను కూడా లెఖిని వాడాను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
Telugu not displaying properly? Check out Tips from Wikipedia

Saturday, January 16, 2010

వరల్డ్ స్పేస్ మూగ బోయింది!


ఇంట్లో ఇప్పుడు ఒక రేసీవేర్, ఒక జత స్పీకర్స్ ఖాళీ గా పడున్నాయి!
ఆర్జే లు మ్రిణాలిని, కృష్ణ మోహన్, తదితరుల గొంతు వినిపించట్లేదు!
ఏవో కష్టాలలో ఉన్నారంట, మన డబ్బు ఏమైనా ఉన్నా ఇచ్చే పరిస్తితి లో కూడా లేరుట!
డబ్బు సంగతి పక్కన పెడితే, రోజు ఉదయాన్నే బంగారం లాంటి పాటలతో నిద్ర లేపే వరల్డ్ స్పేస్ ఇంక లేదు, ఇప్పట్లో మరి రాదు!
మళ్ళీ మన మామూలు 'FM' రేడియోలే మిగిలాయి :(
'చిగురాకుల లో చిలకమ్మా' వింటున్నప్పుడు మధ్యలో 'మన్మోహన్ జాదూ మలాం' గజ్జి మందు గురించి మళ్ళీ వినాలి!
ఎంత పని చేసారు వరల్డ్ స్పేస్! వాళ్లకి రెహ్మాన్ కంపోస్ చేసిన ట్యూన్ ఇప్పుడు యు ట్యూబ్ లో డౌన్లోడ్ చేసి వినాల్సిందే! హిందీ లో ఫరిష్తా, ఝాంకార్, ఇంగ్లీష్ లో క్లాసిక్, ఇవన్నీ మరి లేవు! డాబా మీద పెట్టిన శ్యాటిలైట్ రేడియో డిష్ ఇంక తుప్పు పట్టడమే!
మళ్ళీ 'ఉల్లాసంగా ఉత్సాహంగా' FM రేడియో వినే ప్రయత్నం చెయ్యాలి!

1 comment:

cbrao said...

మొన్ననే World Space Radio కొందామనే ఆలోచనలో ఉన్నా. ఇంతలో ఈ దుర్వార్త. విచారకరం. మరలా పునః ప్రసారం కాగలదని ఆశిద్దాం.