అన్ని ఊర్లలో లాగా వైజాగ్ లో కూడా సందుకి నాలుగైదు పోటీ పడి మరీ పెట్టిన బొమ్మలు ఉన్నాయి. ఐతే ఈ సంవత్సరంవాళ్ల ఏరియా లో పెద్ద బొమ్మ వీళ్ళదే. ఒక ఇరవై అడుగుల పైన ఉన్నాడు గణపతి. ఎలక ఐదారు అడుగులు ఉంటుంది!
అంత బొమ్మ పెట్టినందుకు దానికి తగ్గ సరంజామా కూడా చేసారు లెండి. అడిగితే క్రేన్ తో తెచ్చామన్నారు. పెద్ద పెద్ద స్పీకర్లు, రావడానికి ఒక దారి, వెళ్లడానికి ఒక దారి, లోపల ఫోకస్ లైట్లూ, ఫ్యాన్లూ, ఒకటేమిటి, చాలా బాగుంది సరంజామా.
పూజ అయ్యాక, శ్రీధర్ (మా వాడు) తో చెప్పాను భలే ఉంది రా, సూపెర్ గా చేసారు అని. ఇంకా చేద్దామనుకున్నమండీ, ఇంతకన్నా పెద్ద బొమ్మ దొరకలేదు అన్నాడు! ఒరేయ్, ఈ సందులో ఇదు బొమ్మలు ఉన్నాయి కదా, ఇంత డబ్బులు ఈ ఏరియా వాళ్ల దెగ్గర ఎలా కలక్ట్ చేసారు అని అడిగితే నవ్వి, ఇక్కడ చందాలు తీసుకున్నది చాలా తక్కువండీ, మొత్తం పార్టీల వాళ్ళే ఇచ్చారు అన్నాడు!
శ్రీధర్ ఉవాచ - ఫలానా చిరంజీవి పార్టీ వాళ్లు ఇరవై వేలు ఇచ్చారు, ఇదేదో బాగుంది కదా అని అనుకుంటే, తెలుగు దేశం వాళ్లు వచ్చి వీళ్ళ బ్యానర్ కాదు, మాదీ కట్టండి అని వాళ్లు ఇరవై వేళ ఒక్క రూపాయి ఇచ్చారు!
వీళ్ళకి ఇదేదో బాగుంది అని ఆ ఏరియా కార్పోరేటార్ దేగ్గిరకి వేల్లారంతా, ఆయన (మీరనుకున్నట్టే) కాంగ్రెస్ మనిషి. అతను టెంట్ కి, స్పీకర్ సెట్ కి, మైక్లకి, లైట్లకి అయ్యే ఖర్చు పెట్టుకుంటా అన్నాడు!
అంతే! ఇరవై వేలు పెట్టి బొమ్మ, రోజు సంత్రపణలు, పూజలూ, ప్రసాదాలూ, ఓహో, ఏమి ఆర్భాటం గా చేసారనుకున్నరూ!! తలో వైపూ ఒక్కో బ్యానర్ కట్టేశారు.
గణపతి కి అందరూ ఒకటే కదా!
జనాలందరూ హ్యాపీ! అన్ని పార్టీలు అన్ని వర్గాలు కలిసి చేస్తున్న వేడుక కదా! గొడవలు లేవు, బాధలు లేవు!
మిగిలిన డబ్బులతో నిమజ్జనం అయ్యాక ఏదైనా మంచి పని చేద్దామని డిసైడ్ అయ్యారు ఆ బాచ్ అందరూ.
అప్పుడే మా వాడు వచ్చే సంవత్సరానికి లెక్కేస్తున్నాడు!
గణపతి బప్పా మోరియా!

2 comments:
:) ఇలా పండుగలని తమకు అనుగుణంగా చేసుకోవడంలో ఈపార్టీల్లోళ్ళు ముందుంటారు.అదే ఏ అనాధశరణాలయమో కడతామని వెళితే పైసా విదల్చరు.
:-)
Post a Comment