నెను కూడా లెఖిని వాడాను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
Telugu not displaying properly? Check out Tips from Wikipedia

Wednesday, June 25, 2008

కొంచం ఆలోచించండి!

నిన్న మద్యాహ్నం మా ఇంటి పక్కన ఇస్తిరీ బండి వాడు, ఆటో డ్రైవర్ మధ్య సంభాషణ చొక్కా ఇస్తిరీ చేయించుకుంటున్న నేను వినడం జరిగింది.
ఈ మధ్య జరిగిన మునిసిపల్ ఎన్నికలలో వాళ్ల వార్డ్ అభ్యర్ధి ఒకాయన 'నన్ను గెలిపించండి' అన్న కాగితాన్ని ఇంటింటికీ తిరిగి పంచాడుట. దానితో బాటు ఒక ఇదు వందల కాగితం పిన్ చేసి మరీ పంచాడుట.
మనం ఇక్కడ ఒక సాధారణ 'Corporator' ఎన్నిక గురించి మాట్లాడుతున్నాము. అలాగ ఎంత మందికి పంచాడో తెలియదు కానీ, చాల మందికి ఇచ్చే ఉంటాడు! నా ఆశ్చర్యం చూసి వాళ్లు నవ్వుకున్నారు. ఇది చాల మామూలు విషయం బాబూ. ప్రతీ సారీ జరిగేదే అన్నారు.
ఆలోచించాను - ఎన్నికలలో గెలిస్తే అతని జీతం ఎంత ఉంటుంది?? మహా ఐతే ఇరవై వేలు. అంతేనా? పెద్ద పెర్క్స్ కూడా ఉండవు కదా. ఏ ధైర్యం తో ఆయన ఆ లక్షల రూపాయిలు గుమ్మరించాడు?? అతను ఖర్చు పెట్టిన డబ్బు పార్టీ ఫండ్ లోది కాదు. అండ్ ఆయన పదవి లో పూర్తి ఇదు సంవత్సరాలు ఉన్నా అది వెనక్కు సంపాదించే మార్గం (లీగల్ గా) లేదు. సో, ..........
మనం లంచగొండితనం ఎక్కువయిపోయింది అని, కరప్షన్ పెరిగిపోయింది అని, అవినీతి అంతం లేకుండా పోతోంది అని పెద్ద పెద్ద మాటలుమాట్లాడతామే, ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు?? కార్పొరేటర్ దెగ్గిర నుంచి ఎం.పీ దాకా, కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకోవడం లేదు?? ఖర్చు పెట్టిన మొత్తం వెనక్కి తెచ్చుకొనే ప్రయత్నం లో వారి బాధ్యతలు మరిచిపోయిన తరువాత మనకి సడన్ గా మెలుకువ వచ్చి, వచ్చే ఎన్నికలలో వేరే పార్టీ వాళ్ళకి పట్టం కట్ట బెడతాము. మళ్ళీ కథ మొదలు!!
ఇదే ప్రజాస్వామ్యం కదా!!
సామాన్యుడిని మనం అడగలేము. వాడికి ఆ రోజు కి ఇదు వందలు వస్తే ఇంటిల్లిపాది కడుపు నిండా తింటారు! సో, వాడు ఎందుకు 'నో' అంటాడు?
ఎప్పటికి వస్తుంది మార్పు?? ఎవరు తెస్తారు? మన దేశం లో అవినీతి విలువ లక్షల కొట్లలో ఉంది. ఆ మొత్తం దేశానికి ఉపయోగ పడితే మనం పేద దేశం కానే కాదు. ఎవరు చేస్తారు ధైర్యం??
యువత రాజకీయాలలోకి రావాలి అని అందరూ అంటారు, ఓ నలుగురు కుర్రాళ్ళు పార్టీ లోకి వస్తే ఏమి ఉపయోగం? సిస్టం వాళ్ళని కూడా మార్చేస్తుంది! మరి ఏది దారి??
కొంచం ఆలోచించండి!

5 comments:

Anonymous said...

ప్రజలు ఆలోచించనంతవరకు ఈ సమస్య పరిష్కారం కాదు. ఇంత డబ్బు కుమ్మరిస్తున్నాడంటే వాడు ఇంకెంత డబ్బు నొక్కుతాడో తెలియటం లేదా… కనిసం మంచి ఎజెండాతో వచ్చినె లోక్ సత్తా లాంటి పార్టీలను గెలిపించగలిగితే చాలు…

Kathi Mahesh Kumar said...

ప్రస్తుతానికి పెద్దగా దార్లున్నట్లు నాకైతే తోచడం లేదు. ఇలాంటి నిజాల్ని భరించి, లేకపోతే కళ్ళుమూసుకుని, లేదంటే మనమూ ఈ పరిస్థితిలో భాగమైపోయి మిన్నకుండటం తప్ప మరో దారిలేదు.

మన దేశంలో రాజకీయాలు కూడా ప్రొఫెషనలైజ్ అయ్యి మంచి జీవభత్యాలూ, పర్ఫార్మెంస్ అలవెన్సులూ ఇస్తే తప్ప యువత మాత్రం ఇటువైపు చూడదు. ఇక లోక్ సత్తా సంగతి ఈ ఎన్నికల తర్వాత చూద్దాం.

Indian Minerva said...

రవీంద్ర గారన్నట్లు ఇది మన ఆలోచల్లో మార్పుతో వచ్చేదే (అసలు మనం ఆలోచించడమంటూ మొదలుపెట్టినప్పటిడు కదా). మీరన్నదీ నిజమే యువకులు రాజకీయాలోకి రావడం వల్లమాత్రమే యేదో అయిపోదు ఆ వచ్చేవాళ్ళకు (అంటే నాకు అవసరం లేదని అర్ధం!!) కొంచెం నిస్వార్ధ బుధ్ధి వుండాలి. ఆ వచ్చే వాళ్ళుకూడా మార్చడానికికాకుండా మారిపోవడానికి సిధ్ధమయ్యి వచ్చారనుకోండి ఇక చూడాలి వ్యవహారం. ప్రస్తుతం చాలా వోట్లు కులానికో, డబ్బుకో లేదంటే పార్టీకో పడుతున్నాయి కానీ అభ్యర్ధికి కైతే కాదు మరి మందుకు కూడా పడుతున్నాయేమో నాకైతే తెలీదు. సరే యెవరో తెలీక యేదో చేస్తున్నారనుకో తెలిసీ నేనెందుకు తెలియ చెప్పట్లేదు ఆ... నాకు నా పన్లూ ముఖ్యం, నా కుటుంబం ముఖ్యం, నన్నేమైనా చేస్తారేమోనని భయం. కాబట్టి యెవరైనా దేశాన్ని రక్షించడానికి నడుంకట్టండి, నేను మీకు బాకాలూదుతాను.

Unknown said...

ఎన్నికల సంఘం సరయిన చట్టాలనే రూపొందించింది వీటిని అరికట్టడానికి. కానీ అంతటినీ ఓవర్ సీ చెయ్యడానికి సరయిన వనరులు కూడా కావాలిగా...

కొంతలో కొంత ఎన్నికల సంఘం కఠినంగా ఉండడం ఈ మధ్య ఎన్నికల్లో చూసాము కాబట్టి ఇక ముందు ఏమన్నా మంచి రోజులొస్తాయేమో ?

Bolloju Baba said...

thought provoking
bolloju baba