నెను కూడా లెఖిని వాడాను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
Telugu not displaying properly? Check out Tips from Wikipedia

Monday, April 28, 2008

అప్పా రావు కాలనీ - 1

'వెల్కం టు అప్పా రావు కాలనీ ' అనే తెల్ల బోర్డు.
విశాఖపట్నం లో దిగంగానే సుర్యానికి స్వాగతం పలికింది ఆ బోర్డే.
ఉద్యోగం వెతుక్కుంటూ సూర్యం విశాఖపట్నం చేరాడు. అతనిది విజయనగరం అవతల సిరి పల్లె.
అమ్మ, నాన్న, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక ముసలి తాత గారు కుట్ర పన్ని వాడిని ఊరిలోంచి తరిమేసారు.
మరి తరిమెయ్యరూ ? సుర్యానికి 24 ఏళ్లు. వ్యవసాయానికి ఒళ్లు ఒంగలేదు. పోని ఏదో చదివి ఊడపీకుతాడు అనుకుంటే 4 ఏళ్లు కష్టపడి డిగ్రీ గట్టేక్కించాడు. వెంటనే కమాన్ అని ఇంట్లోంచి గెంటేసారు.
ఎగ్జామ్స్ లో సుర్యానికి స్లిప్పులు అందించిన చిన్న రావు పెదనాన్న కొడుకు రాజ్. అసలుకి రాజేశ్వర రావు అన్న మాట, పట్నం వచ్చి స్టైల్ గా మార్చేసాడు! గత 5 సంవత్సరాలనుంచి ఏదో కంప్యూటర్ కోర్సులు అంటు రెండు నెల్లకోకసారి పది వేలు పంపమని వాళ్ల నాన్నకి రంగు కాగితం మీద ఉత్తరం రాస్తాడు. ఇంక ఎన్నాళ్ళు రా అంటే 'ఏమి చెయ్యను నాన్నా , నేను నేర్చుకున్న కోర్సులు మారి పోతున్నాయి' అంటూ ఉంటాడు. ఈ సారి ఆఖరు అని సుర్యానికి ఇచ్చి డబ్బు పంపేడు వాళ్ల నాన్న. ఇది అయ్యాక ఇంకా ఉద్యోగం రాకపోతే , నల్లమల పో రా అని కూడా చెప్పమన్నాడు.
ఐతే, రాజ్ గత 5 సంవత్సరాలు వేస్ట్ చెయ్యలేదు. ముందు ముందు మీరే చూస్తారు గా! విశాఖపట్నం వచ్చినప్పటి నుంచి రాజ్ అప్పా రావు కాలనీ లో చిరుత గారి ఇంటి డాబా పైన గది లో ఉంటున్నాడు. ఈ చిరుత గారి అసలు పేరు సుబ్రహ్మణ్యం. వెలికొండ సుబ్రహ్మణ్య శర్మ. ఆయన ఇంటి బయిట చిన్న గ్రౌండ్ ఉంది. బబ్లూ గాడి నేతృత్వం లో కాలనీ క్రికెట్ టీం అక్కడే ప్రాక్టీస్ చేస్తారన్నమాట. మరి బాగా గోల చేస్తే శర్మ గారు వచ్చి పిల్లలకి క్లాస్ పీకుతూ ఉంటారు. ఒక రోజు బబ్లూ గాడికి మండి, పిల్లలందరితోను 'ఒరేయ్, అంకుల్ కి కోపం వస్తే అచ్చు చిరుత లో రామ్ చరణ్ లాగ ఉన్నారు కద' అన్నాడు! అంతే, ఆ రోజు నుంచి శర్మ గారి పేరు కాలనీ మొత్తం లో చిరుత అయిపోయింది. (శర్మ గారు బయిటకి కోపం నటించినా, లోపల ఈ ముద్దు పేరు కి హ్యాపీ ఏ లెండి!)

..........ఇంకా ఉంది.

--------------------------------------------------------------------------------------------------

ఈ కధ పూర్తిగా నాదే. బుద్ధి పుట్టినప్పుడల్లా రాస్తూ ఉంటా! బోలెడు పార్టులు ఉన్నాయి! కమింగ్ సూన్!
ఆదిత్య

2 comments:

నిషిగంధ said...

'వెంటనే కమాన్ అని ఇంట్లోంచి గెంటేసారు ' :)) బాగా రాస్తున్నారు.. తరువాతి భాగం ఎదురు చూస్తుంటాము.

Anonymous said...

అదిరిందయ్యా ఆదిత్యా..!! గంభోళ జంభ..యిది మాత్రము కేకో కేక..పేరు కి తగ్గట్లే నీ టపాలు కూడా మాంచి ఉత్సాహం గా వున్నాయి...తెలుగు బ్లాగు లోకానికి స్వాగతము-సుస్వాగతము.. నీ టపాలు చూస్తుంటే, ముందు ముందు నీ నుండి మాంచి హాస్యాన్ని చూడొచ్హు అనుకుంటున్నాను.. అంతా మంచి జరుగు (all the best అని)..