నెను కూడా లెఖిని వాడాను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
Telugu not displaying properly? Check out Tips from Wikipedia

Sunday, April 27, 2008

బ్లాగ్గింగ్ లో కొత్త విధానం

ఇవాళ ఉదయం ఈ బ్లాగ్ తయ్యారు చేసినప్పుడు లేఖిని వాడాను. ఐతే బ్లాగ్ లో పబ్లిష్ చేసిన తరువాత బ్లాగర్ లో ' Type in Indic Languages' అనే లింక్ కనబడింది. ఇది ఇంకా బాగుంది!! గూగుల్ భలే తెలివైన కంపెనీ. దాని తెలివైన Translator ఇంజన్ దానంతట అదే పదాలని కూర్చేస్తుంది. రెండు ఈ లు రెండు ఆ లు టైపు చెయ్యకర్లేదు.
మిగితా వాటిల్లో ఈ అవకాసం ఉందొ లేదు తెలియదు కాని, బ్లాగర్ సూపర్!!!
ఈ లోపే ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది.
Firefox లో తెలుగు సరిగ్గా డిస్ప్లే అవ్వటం లేదు! ఐతే www.te.wikipedia.orgలో వెతికితే Firefox ని కొత్త Version కి మార్చుకోమని సలహా ఇచ్చింది.
అప్పుడు గూగుల్ లో వెతికితే దొరికినదే ఈ "Firefox ౩ బీటా5" దానిని మీరు కూడా ఇక్కడ download చేసుకో వచ్చు.
ఇప్పుడు తెలుగు తెలుగులాగా కనబడుతోంది! భలే భలే! :)
ఇక ఖుమ్మేయ్యడమే!

2 comments:

వీవెన్ said...

గూగుల్ ఇండిక్ బానే ఉంటుంది. కానీ కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపుచేయాలంటే చాలా పరికరాలున్నాయి. వాటిని కూడా చూడండి.

మీరు లింకు ఇచ్చిన ఫైర్‌ఫాక్స్ వెర్షన్ పాతది మరియు అది ఆల్ఫా వెర్షన్. ఇప్పుడు ఫైర్‌ఫాక్స్ 3 బీటా 5 కూడా విడుదలయ్యింది. కొత్త బీటాలని ఈ స్థిరలింకు నుండి తెచ్చుకోండి. ఫైర్‌ఫాక్స్ 3 ఇంకా బీటా స్థాయిలో ఉంది కాబట్టి దానిని వాడకుండా సుస్థిరమైన ఫైర్‌ఫాక్స్ 2 లోనే చూడాలనుకుంటే:

మీరు XPలో సంక్లిష్ట లిపుల తోడ్పాటుకి కావాల్సిన ఫైళ్ళని స్థాపిస్తే (ఇక్కడి మొదటి మూడు సోపానాలు పాఠిస్తే), ఫైర్‌ఫాక్స్ 2లో కూడా తెలుగు చక్కగా కనబడుతుంది. ఫైర్‌ఫాక్స్ 2లో ఇంకా సమస్యలు ఉంటే, Unjustify వాడవచ్చు.

Aditya said...

థాంక్స్ వీవెన్. నాకు తెలుగు లో బ్లాగింగు కొత్త కదా. అందుకే :)