
సరదాగా ఈ గంభోళ జంభ మొదలుపెట్టి ఉత్తుత్తినే దీనికి కూడా Google Analytics పెట్టాను.
వామ్మో! వారి నాయనో! ఒక రోజు లో 124 మంది! నిజంగా భలే అనిపించింది లెండి!
ఇంగ్లీష్ లో చాల బ్లాగులు చూస్తూ ఉంటాము కాని ఇవాళ నేను చూసిన తెలుగు బ్లాగులు మాత్రం భేష్!!!
వాటిలో కొన్నిటిని మీ కుడి వైపు కనబడే ' అద్భుతమైన కొన్ని బ్లాగులు' అనే లింక్ లో పెట్టాను. మీకు కూడా తెలిసిన మంచి తెలుగు బ్లాగులు ఉంటే చెప్పండి. తప్పకుండ చేరుస్తా!
నా కొత్తదనాన్ని (చేత్తదనాన్ని) మన్నించి, మంచి మంచి సూచనలు ఇచ్చిన వాళ్ళందరికీ బోలెడు థాంక్స్! వీవెన్, వికటకవి, అందరికీ!!
కాక పోతే నాదొక ప్రశ్న.
నేను తెలుగు బ్లాగ్ మొదలడదామనుకున్నప్పుడు మొదట 'అబ్బ డబ్బ జబ్బ" అనే పేరు వెతికాను. బ్లాగర్ తిట్టింది! ఒరేయ్, ఆ పేరు అప్పుడే ఎవరో తీసేసుకున్నారు అని! వెతికితే భూమిక రాసిన మొదటి పోస్ట్ కనబడింది.
భూమిక గారూ, సరైన బ్లాగ్ పేరు కొట్టారు గా, రాయండి!! మీ లో ఎవరికైనా ఆవిడ కనబితే, నా నమస్తే చెప్పండి!
అలా మొదలయ్యిందన్నమాట ఈ గంభోళ జంభ!!
3 comments:
మీరు జల్లెడను ఇంకా చూసినట్టులేరు.
http://jalleda.com
తెలుగులో క్రమంగా బ్లాగుతూండండి, రోజుకు రెండు వేల మంది చూసే రోజు కూడా వస్తుంది :)
వెబ్ దునియా ( http://telugu.mywebdunia.com/ )తెలుగు బ్లాగులకు మన (కూడలిలో క్రోడీకరించబడ్డ) బ్లాగులకంటే ఎక్కువ ప్రాచుర్యం ఉంది.
పాఠకులు రకరకాలుగా ఉంటారు. అందరినీ మెప్పించడం సాధ్యపడదు. అసలు బ్లాగుల లక్ష్యం అది కాదు, కాకూడదు. ఇదేమీ ఒక వెలకు అమ్మే పత్రిక కాదు గదా ! మనకు తెలిసింది రాసుకుంటూ పోవడమే. మొదట్లో మనల్ని అభిమానించినవాళ్ళు కూడా మన ఆర్థిక, రాజకీయ, మత, సాంఘిక, కోణం ఇది అని అనిపించాక మన బ్లాగు చదవడం మానేస్తారు. అలాగని మనం రాయడం మానుకోకూడదు.
రెండోది - infotainment. బ్లాగుల్ని జనం రకరకాల ప్రయోజనాల కోసం చదువుతారు. సరదాగా చదివేవాళ్ళు కొందఱు. "మన"వాళ్ళెవరైనా తగుల్తారేమోనని చూసేవాళ్ళు కొందఱు. మొత్తం మీద విషయం ఏదైనప్పటికీ ప్రతి బ్లాగునుంచి ఎంతోకొంత కొత్తదనాన్ని అపూర్వమైన సమాచారాన్నిజనం ఆశిస్తారు. దేనితో పాటు మీవైపునుంచి మీరుగా ప్రతి వారం పది/పదిహేను రోజులకొక అణిముత్యాన్ని రాస్తూండాలి.
పాఠకుల్లో రెండు రకాలుంటారు. Niche readers కొందఱు. అంటే మీరు తదుపరి ఏం రాయబోతారా ? అని ఆత్రంగా ఎదురుచూసేవారు. అలాగే చుట్టపు చూపుగా అప్పుడప్పుడు మీ బ్లాగులోకి తొంగిచూసి వంగివాలేవారు కొందఱు. ఆ మొదటి రకం పాఠకుల కోసమే మీరు రాయాలి.
Best of luck
Post a Comment