నెను కూడా లెఖిని వాడాను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
Telugu not displaying properly? Check out Tips from Wikipedia

Wednesday, May 28, 2008

సర్కస్ సందడి.

అబ్బ! ఇన్నాళ్ళకి వైజాగ్ లో సర్కస్ చూసే అవకాశం వచ్చింది!
గత నాలుగు సంవత్సరాలలో మూడో నాలుగో సర్కస్ లు వైజాగ్ వచ్చేయి, కాని చూద్దాము అని డిసైడ్ చేసే లోపలే వెళ్ళిపోయాయి!! ఇప్పుడు ఉన్నది కూడా ఎల్లుండి వెళ్ళిపోతోంది :)
ఐతే ఈ సారి చూసాము లెండి! నిన్న సాయంత్రం.
ఎన్ని పాత స్మృతులు! భలే భలే జ్ఞాపకాలు!
ఒక పదిహేను సంవత్సరాల క్రితం (అప్పటికి నేను ఏడో క్లాస్ అనుకుంటా) బందర్ లో సర్కస్ చూడడం జ్ఞాపకం. మళ్లీ నిన్ననే!
చిన్నప్పుడు 'Mr Galliano's Circus' అని Enid Blyton రాసిన పుస్తకం ఒకటి చదివేను. అప్పటినుంచీ సర్కస్ అంటే ఏదో తెలియని అభిమానం. మీలో ఎవరైనా ఆ పుస్తకం చదివి ఉంటే ఇక్కడ ఒక కామెంట్ వదలండి.
సర్కస్ లోపల వాళ్ల జీవితాలు, వారి ఆనందం, అంతా ఆ పుస్తకం లో బ్లయ్టన్ భలే రాసేరు.
నిన్న వెంటనే అదే గుర్తొచ్చింది!
మీరు కమల్ హాసన్ సినిమా విచిత్ర సోదరులు చూసే ఉంటారు కదా, నిన్న సర్కస్ లో మరుగుజ్జు జోకర్లని చూస్తే ఆ సినిమా జ్ఞాపకం వచ్చింది. సర్కస్ లో వారి జీవితాలు భలే వెరైటీ కదా! అదొక వేరే ప్రపంచం!
నిన్న ఇంకొకటి అనిపించింది, అక్కడ జింనాస్టులు, గారడి వాళ్ళను చూసినప్పుడు, వీళ్ళని ఒలింపిక్స్ కి పంపితే మన దేశానికి కొంచం అయినా పరువు దక్కుతుందేమో అని!
ఇద్దరు అమ్మాయిలు తుపాకీలు పట్టుకుని అంత దూరంలో ఉన్నా బలూన్లను సునాయాసంగా కొట్టేశారు! వెనక్కి తిరిగీ చిన్న అద్దంలో చూసి మరీ గురిపెట్టి కొట్టేరు! వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇస్తే ప్రపంచ స్థాయి క్రీడాకారినిలు ఖచ్చితంగా అవుతారు!
మరో భలే విషయం ఏమిటంటే నిన్న సర్కస్ లో నలుగురు రష్యన్ అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. వాళ్ళే కాక నేపాలీలు, పకిస్తానీలు, సింగపూర్ వాళ్లు, శ్రీ లంక వాళ్లు, ఆస్ట్రేలియన్ అమ్మాయి, ఆఫ్ఘనిస్తాన్ అబ్బాయి, ఎందరో! మన దేశం నుంచి కూడా వీరే వీరే ప్రాంతాల వారు ఉన్నారు! అదొక మినీ-ప్రపంచం!
కొందరు ఇంకా మీసాలు రాని పిల్లలైతే మరి కొందరు సర్కస్ లో పుట్టి పెరిగి జుట్టు నేరిసిపోయన వాళ్లు!
అక్కడి జంతువులు కూడా ఎన్నాళ్ళ నుంచో ఆ సర్కస్ లో భాగం గా ఉండిపోయాయి! (ఈ మధ్య ప్రభుత్వ చర్య వల్ల పులులూ సింహాలూ లేవు లెండి. ఏనుగులు, గుఱ్ఱాలు, కుక్కలు, ఒంటెలు, చిలుకలే ఉన్నాయి)
ఒక వూరు అని కాకుండా దేశం అంతా ప్రయాణం చేస్తూ 'నోమాడ్' ల లాగ జీవించే సర్కస్ వారిని చూస్తే వెంటనే చక్రాలు తిరుగుతాయి, పాత కాలం లోకి వెళ్ళిపోతాం కదు!
ఈ స్పీడ్ కాలం లో కూడా ఎంతో కష్టపడి సర్కస్ నిర్వహించడానికి సాహసిస్తున్నవారికి హృదయపూర్వక అభినందనలు!
ఈ సారి సర్కస్ వచ్చినప్పుడు ముందే వెళ్ళాలి!!!

మీరు చూసిన సర్కస్ లో మీకు బాగా గుర్తొచ్చే అంశం ఏదైనా ఉంటే ఇక్కడ కామెంట్ వదలండి!

2 comments:

Sujata M said...

అవును. సర్కస్ ను నిర్వహించడానికి పాపం వాళ్లు ఎంత కష్ట పడతారో కదా అనిపిస్తుంది. కళా కారులు ఎప్పుడూ ప్రాక్టీసు చేస్తూనే ఉండాలి. జంతువులకూ, మనుషులకూ పోషించాలి. వాళ్ల ట్రాన్స్పోర్ట్, పెర్మిషన్లూ.. రేషన్, కరెంటూ.. ఇలా పాపం చాల ఖర్చు అవుతుంది. ఒక ఊళ్ళో ఒక పది రోజులు ప్రదర్సన ఇచ్చి, పోస్టర్లు పంచి, ప్రచారం చేసుకుని, డేరాలు బిగించి.. బోల్డంత పని చెయ్యాలి. మనం చిన్న పిల్లల్ని తీస్కెళ్ళి చూపిస్తాం. ఎపుడు చూసినా అబ్బుర పరిచేదే సర్కస్. కానీ, ఎంతైనా వాళ్ల కష్టాలు - అప్పుడెప్పుడో రాజ్ కపూర్ సినిమా లో, కింగ్ ఖాన్ సీరియల్లో చూసినవన్నీ గుర్తొస్తాయి.

Unknown said...

సర్కస్ అంటే నాకూ భలే ఇష్టం. ఎన్నో జ్ఞాపకాలు నిజమే...