నెను కూడా లెఖిని వాడాను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
Telugu not displaying properly? Check out Tips from Wikipedia

Thursday, May 1, 2008

గూగుల్ ప్రభంజనం!

ఇంటర్నెట్ వచ్చిన తరువాత ప్రపంచం లో ఎన్నెన్నో మార్పులు వచ్చేయి!
గూగుల్ వచ్చే ముందు ఇంటర్నెట్ ఒకలా ఉంటే అది వచ్చేక ఇంటర్నెట్ పూర్తిగా మారిపోయింది!
ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇట్టే అందుబాటులోకి గూగుల్ తచ్చేసింది.
నేను ఇక్కడ అనడ్రికి సుపరిచితమైన గూగుల్ సెర్చ్ గురించి మాట్లాడట్లేదు.
సెర్చ్ కాకుండా ఇంక ఎన్నో ఫ్రీ సేర్విసులు ఉన్నాయి గూగుల్ లో.
అందులో ఒకటి ఈ Google Analytics. కిందటి సారి ఒక ఆర్టికల్ లో Google Analytics గురించి ఒక పోస్ట్ రాసాను. ఐతే అందులో రాయని విషయం ఏమిటంటే Analytics వాడి మన సైట్ కి వచ్చిన వాళ్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చేరో కూడా తెలుసుకో వచ్చు.
ఇవాల్టికి ఈ బ్లాగ్ స్టార్ట్ చేసి 5 రోజులయ్యింది. ఇప్పటికి

ఇండియా నుంచి 169 మంది,
అమెరికా నుంచి 150
ఇంగ్లాండ్ నుంచి 18
కెనడా నుంచి 6
సింగపూర్ నుంచి 6
బహ్రెయిన్ నుంచి 4
జపాన్ నుంచి ౩
కతార్ నుంచి 2
జెర్మనీ నుంచి 2, ఈ గంభోళ జంభ చూసారు!

బహ్రెయిన్, కతార్, జెర్మనీ లాంటి దేశాల నుంచి తెలుగు వారు వచ్చేరు అంటే భలే ఆనందం గా ఉంది కదూ!
భారత దేశం లోకి వెళ్లి చూస్తే మన ఆంధ్రా ఊరులే కాకుండా మంగళూరు, కొచ్చిన్, లాంటి పట్నాల నుంచి కూడా హిట్స్ వచ్చేయి!
అమెరికా లో 10 స్తేట్ల నుంచి హిట్స్ వచ్చేయి! ఐతే నాకు అర్థం అయిన విషయం ఏమిటంటే కాలిఫోర్నియా లో ఎక్కువగా తెలుగు వాళ్లు ఉండుంటారు, 51 మంది ఆ రాష్ట్రం నుండి వచ్చేరు. అంతే కాదు, కాలిఫోర్నియా లో అల్విసో, సక్రామెంతో, హాయ్వార్డ్, సంట క్లారా లాంటి 10 ఊరుల పేరు చూపించింది Analytics!
పైన చెప్పిన దేశాలే కాకుండా స్పెయిన్, ఇజ్రాయిల్ మరియు వియత్నాం నుంచి కూడా ఇద్దేసి తెలుగు వారు వచ్చినట్లు గూగుల్ చూపిస్తోంది! ఈ ఆర్టికల్ చదువుతున్న వారి లో ఆ దేశాల వారు ఎవరైనా ఉంటే హలో అనండి!!
ఇది ప్రభంజనం కాక మరేమిటి?? ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత సులువుగా అందిస్తున్న గూగుల్ కి బోలెడన్ని మంగిడీలు!!!

2 comments:

రాధిక said...

ప్రపంచ వ్యాప్తంగా వున్నారు మన తెలుగు బ్లాగరులు.మీకు ఎక్కువ అతిధులు ఇండియా,అమెరికాలనుండే వస్తారు.ఇలాంటి రిపోర్టులు చూపే సైట్లు ఇంకా చాలా వున్నాయి.
కామెంట్ల దగ్గర వర్డ్ వెరిఫికేషన్ తీసేయరా?ప్లీజ్

Chaks said...

శుభాకాంక్షలు. ఇటువంటివే మరికొన్ని సైట్ లు నా బ్లాగ్ లో ఇచ్చాను. అనలిటిక్స్ తోపాటు నాకు నచ్చినవి GetClicky మరియు icerocket