నెను కూడా లెఖిని వాడాను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
Telugu not displaying properly? Check out Tips from Wikipedia

Wednesday, June 4, 2008

బుజ్జి గాడు - made from పోకిరి, మనసంతా నువ్వే, etc!

మంచి తెలుగు సినిమా చూసి చాల రోజులు అయ్యింది!
సో, నిన్న రాత్రి రెండో ఆటకి బుజ్జి గాడు చూద్దామని వెళ్ళాం. మా వాడు ఒకడు ఈ సినిమాని ఇప్పటికి మూడు సార్లు చూసాడు! దానితో ఇదేదో సూపర్ అని వెళ్లి కాసేసాము!
బాబోయి!!!
నాకు ఊహ తెలిసి చూసిన అవకతవక కంగాళీ భాషుం సినిమాల్లో ఇదొకటి!!! అంటే జాని, డాన్, అలాంటి కోవకు చెందిన సినిమా అన్నా మాట!!
మీరు 'జై చిరంజీవ' చూసి ఉంటే మీకు 'ఇది విజయభాస్కర్ తీయలేదు, ఎవర్నో పెట్టి తీయంచి వాడి పేరు ' పెట్టుకున్నాడు అని అనిపిస్తుంది, అవునా?
ఇందులో సేం ఫీలింగ్, పూరీ జగన్నాథ్ తో.
ఇది
మామూలుగా జరిగేదే లెండి - ఒక భీబత్సమైన హిట్ తరువాత డైరెక్టర్ కూడా ఏదో ఖుమ్మేద్దామని ట్రై చేస్తాడు, 'డ్హాం' అనిపోతుంది సినిమా!
ఇదేదో పోకిరి పార్ట్-2 లాగ బోలెడు తుపాకీలు, ముమయిత్ ఖాన్ తో ఒక పాట, ఎవర్నీ ఖాతరు చెయ్యని హీరోని పెట్టి కధ లేకుండా నడిపించేద్దాము అనుకుంటే, మరి ఇలాంటి సినిమాలే వస్తాయి!
మొట్ట మొదటిగా పాటలు బుస్స్స్స్! సగం సినిమా లైఫ్ పోయింది! ఎండ్ బోలెడు పాటలు పెట్టేసారు!
బాగా బీటింగ్ మాష్టారు :)
ఏదో సినిమా లో ఆలి, m s నారాయణ , కామెడి లాగ 'మనసంతా నువ్వే కథ ని 'గుండంతా నువ్వే' అని చెప్తే తెలుసుకోలేనంత వేర్రోడి లాగ కనబడుతున్నాన' న్నట్టు ఏవో మూడు సినిమాలు కలిపి కొత్తరకంగా చూపిస్తే జనాలు మళ్ళీ చొక్కాలూ, వీలైతే బనీన్లు కూడా చింపుకొని చూస్తారు అంటే పొరపాటే!
ఐతే కొన్ని మంచి కూడా ఉన్నాయి లెండి - తీసే విధానం, తేరా పైన చూపే విధానం కొత్త గా ఉన్నాయి. స్పెషల్ గా ఒక రెండు పాటలైతే భలే తీసారు.
మోహన్ బాబు క్యారెక్టర్ వేస్ట్. రెండో హీరోయినే క్యారెక్టర్ వేస్ట్. కోట క్యారెక్టర్ మరీ వేస్ట్. m s నారాయణ, ఆహుతి ప్రసాద్, సుధ పాత్రలైతే మరీ వేస్ట్! అందరికన్నా మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా ఘోరం!! 'నిన్నే పెళ్ళాడతా' లో అద్భుతమైన పాటలు అందించినది ఈయనేనా అనిపిస్తుంది ఈ దిక్కుమాలిన పాటలు వింటే!
తలా తోకా లేకుండా సినిమా తీసినందుకు పూరీ జగన్నాథ్ కి జై!
చూస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు జై జై!

My Rating - 2/5

మీరు కూడా చూసి ఉంటే ఇక్కడ ఒక కూత కుయ్యండి! :)

3 comments:

Kathi Mahesh Kumar said...

ఈ సినిమాని నిజంగా చూస్తున్నారంటారా? బహుశా మీరు టీవీ చూసి మోసపోతున్నారనుకుంటా. మొన్న రిలీజైన రెండోరోజు మదనపల్లె లో ‘సాయిచిత్ర’ ధియేటర్ కి మ్యాట్నీకి టికెట్టు కోసం వెడితే, మార్నింగ్ షో చూసిన ప్రేక్షకుడొకడు "దీనికంటె కంత్రీ బెటర్" అనడం విని, పారిపోయొచ్చా!

Indian Minerva said...

మాష్టారూ.. మీరేమీ ఒంటరి కాదు. మీ బాధ మేమూ మొన్న పడ్డాం. నాకైతే మొహన్ బాబు పాత్రే నచ్చింది. ఇక పాట లంటారా? బాబోయ్...వాటిని రమణ గోగుల పాడలేదు కాబట్టి పాల్ దినకరన్ గారేమైనా పాడేరేమో కొంచెం కనుక్కుని చెబుదురూ తెలుగు పదాల్ని ఆంగ్ల యాసలో ఖుమ్మేసారు (పాటల్ని కాదు మమ్మల్ని అదేలెద్దూ మనల్ని). ఇది చాలదన్నట్లు తమిళ పాట ఒకటి బహుశా చంద్రముఖి లెవెల్లో ఆ పాట హిట్టవ్వుద్ది అని అనుకున్నారేమో. అన్నట్టు ఆ రెండో అమ్మయి యెవరూ....? మొదట్లో ఆ అమ్మాయే హెరాయిన్ (I mean హీరోయిన్) అనుకున్నా! తరువాత చూద్దునుగదా త్రిష!

శ్రీ said...

తెలుగు సినిమా కి అరివీర భయంకరమయిన "పంఖా" నేను. అటువంటి నాకే ఒకసారి చాలనిపించింది. కాకపొతే సినిమా చూసిన తర్వాత పాటలు ఈమద్య వరుసగా పది సార్లు వింటూ ఉంటే "పరవాలేదే? బాగున్నాయే?" అని నా నోటి నుండి తెలియకుండానే వచ్చేస్తున్నాయి. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా వీకు.